స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సబ్యులకు శుభోదయం …. రాష్ట్ర కార్పెంటర్స్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గరోజు….. 19/04/24 వ తేదీ రాష్ట్ర కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ వెబ్సైటు విజయవాడ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో లాంచింగ్ చేయడం జరిగినది మరియు రాష్ట్ర కార్పెంటర్స్ యూనియన్ ఆఫీస్ కొరకు గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో స్థలం చూడటం , అగ్రిమెంట్ చేసుకోవడం అందరికి తెలిసిన విషయమే. రాష్ట్రవ్యాప్త కార్పెంటర్స్ భాగస్వామ్యంతో స్థలం కొనడంజరిగినది. రాష్ట్ర కార్యవర్గసభ్యుల సమక్షంలో , అందరి సహకారంతో స్ధలం గన్నవరం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు యూనియన్ కి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. రాష్ట్ర అధ్యాక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు ,ప్రధాన కార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు ,కోశాధికారి శ్రీ మోహన్ రావు గారు , రాష్ట్రఉపాధ్యక్షులు శ్రీ పట్నం అంబికాపతి గారు ,శ్రీ లక్కోజు సింహాచలం గారు , రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సురేంద్ర బాబు గారు, రాయలసీమ కన్వినర్ శ్రీ నాగరాజు గారు ,పెద్దలు శ్రీ అబ్దుల్ సలంగారు , అన్నమయ్య జిల్లా కన్వినర్ శ్రీ రెడ్డి బాబు గారు , అన్నమయ్య జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ శంకర ఆచారి గారు , జిల్లా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ రహమతుల్లా గారు , జంగారెడ్డి గూడెం చిన్ని గారు , బల్లంకి చిట్టిబాబు గారు , వెబ్సైటు రాజు గారు , జావీద్ గారు , జంగారెడ్డి గూడెం రాంబాబు గారు , తిరుపతి జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుప్పచారి గారు , అన్నమయ్య జిల్లా సురేష్ గారు మరియు గన్నవరం లోకల్ సంఘ నాయకులూ పాల్గొనడం జరిగినది
ఇట్లు
మీ సురేంద్ర బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి