Updates
ఉపోద్ఘాతం
ఓం శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణేనమ:
సృష్టి ఆరంభంనుంచి చేతివృత్తుల వారే మొదటితరం ఇంజినీర్లుగా ప్రసిద్ధిచెందారు , రైతుకు నాగలి చేయుటద్వారా వ్యవసాయానికి , ఎడ్లబండి ద్వారా రవాణా కు మార్గం చూపింది వడ్రంగి (కార్పెంటర్). సమాజ నాగరికత కు ,అభివృద్ధికి చేతివృత్తులే ఆధారం పూర్వకాలంలో పనిలో ఖచ్చితత్వం , నైపుణ్యం వల్ల సమాజంలో ఆదరణ , గౌరవం ఉండేవి. కాలక్రమేణా చేతివృత్తులలోకి కార్పొరేట్ సంస్థల ఆగమనం వల్ల చాలా వృత్తులు కనుమరుగు అయిపోయాయి. నేటిసమాజంలో వేగవంతమే ప్రామాణికం అవుతున్న వేళలో కాస్తో కూస్తో ఆదరణ ఉన్న వృత్తులలో కార్పెంటర్(వగ్రంగి,కలప పని) వృత్తి ఒకటి అంతేకాకుండా పురాతన వృత్తులలో ఒకటి , ఇంటి తలుపులు, కిటికీలు, డైనింగ్ టేబుల్లు, మంచాలు ,అల్మారాలు ,వ్యవసాయ పనిముట్లు వడ్రంగులు చేస్తారు. ప్రస్తుతం వడ్రంగితో పనిచేయించుకుంటే ఆలస్యం అవుతుందని భావించి రెడీమెడ్ తలుపులు, డైనింగ్ టేబుళ్ళను కొనుగోలు చేయడంతో ఈ రకం చేతి వృత్తులు అంతరించి పోతున్నాయి. రాష్ట్రంలో అనేక జిల్లాలలో వేలాది ముస్లింలు కూడా వడ్రంగిపని చేస్తున్నారు. నెల పొడవునా పనిచేసినా కనీసం వెయ్యిరూపాయలు కూడా రాదని వడ్రంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . కులవృత్తినే నమ్ముకున్నా వేలాది మంది తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వెళ్లి కూలీలుగా నౌకర్లుగా, గుమస్తాలుగా వేరే పనుల్లో దుర్భర జీవితం గడుపుతున్నారు . వడ్రంగి ఇంటియజమానులకు భద్రత కొరకు ద్వారబంధాలు , సౌకర్యం కొరకు కుర్చీలు , మంచాలు చేసే కార్పెంటర్ తన బ్రతుకుకు భద్రత , వృత్తికి గ్యారంటీ లేని స్థితిలో జీవిస్తున్నాడు. వృత్తివారు వాడే సాధారణ పనిముట్లు చిత్రిక సుత్తి ఉలి బాడిత రంపం లతోనే అతి సాధారణ పనిముట్లతో ఎంతో అద్భుత సృష్టి చేసిన వడ్రంగులు ఒకపక్క కార్పొరేట్ సంస్థల పోటీని , ప్రభుత్వాలనుంచి ఆదరణ లేకున్నా మనమందరం సమిష్టి కృషితో కనుమరుగు కాకుండా కాపాడుకుంటూ వస్తున్నాము. కానీ మన తర్వాతి తరం ఈ వృత్తిలో కొనసాగడానికి ఎవ్వరు ముందుకు రావడంలేదు అందుకే ప్రభుత్వాలు మనవృత్తిని గుర్తించి ప్రోత్సహించేలా పోరాటాలు చేయాల్సిన అగత్యం వస్తుంది అందుకు బలమైన వేదిక ఒకటి అవసరం. అందుకు రాష్ట్రవ్యాప్త వేదిక , ఐక్యమత్యం ఎంతైనా అవసరం అలాంటి వేదిక బలమైన సంఘం , సమర్ధనాయకత్వo ద్వారానే సాధ్యం.అందుకే ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ ర్తాష్ట్రవ్యాప్త కార్పెంటర్స్ భాగస్వామ్యంతో అనంతపురం వేదికగా 18/10/2023 న పురుడుపోసుకున్నది