స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సర్వసభ్యసమావేశం అనంతపురం పట్టణం లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 19/12/2024 వ తేదీ NS గ్రాండ్ నందు ఉదయం 10గంటలకు ప్రారంభమైనది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , యూనియన్ సభ్యులు పలు జిల్లాలనుంచి పెద్దమొత్తంలో హాజరుకావడం జరిగినది. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం , గత కార్యక్రమాలపై చర్చించడం జరిగినది. భవిష్యత్ కార్యాచరణ , నూతన సంవత్సర క్యాలెండర్ ముద్రణ , సభ్యత్వాలపై సమాలోచన చేయడం జరిగినది. పలువురు సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకొని వాటిపై విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు నూతన నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం పై విస్తృత చర్చ జరిగినది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ , కోశాధికారి శ్రీ మోహన్ రావు గార్ల పర్యవేక్షణలో సమావేశం జరపబడింది




