ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో మొట్టమొదటగా ఒక వృత్తిదారులకు ఒకేచోట సుమారు 300 ఇంటి స్థలాలు ఇవ్వడం అన్నది ఒక్క పీలేరు మండలంలో సాధ్యం అయింది. కలసివుంటే ఎంతటి అసాధ్యం అయిన పని కూడా సాధ్యం అవుతుంది అని పీలేరు మండల కార్పెంటర్ సోదరులు నిరూపించుకున్నారు. శ్రీ పట్నం అంబికాపతి ఆచారి గారి సారధ్యంలో మండల కార్పెంటర్స్ అధ్యక్షులు శ్రీ రెడ్డి బాబు గారు , కోశాధికారి శ్రీ శంకరాచారి గారు కమిటీ సభ్యులు కృషి ఫలితం ఈ కార్పెంటర్స్ కాలనీ. పనులు ,నిద్ర మానుకొని ఎన్నోసార్లు అధికారుల చుట్టూ , రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి , ఎగతాళిగా నవ్వుకున్నా వారిముందు సగర్వంగా నిలుచున్నా కృషివరులు. కొండలు పిండిచేసి కార్పెంటర్స్ కి అభివృద్ధి చేసిన లేఔట్ ల ఇవ్వడం అన్నది, అతి తక్కువ సమయంలో పగలు రాత్రి అన్నది చూడకుండా వంతులవారీగా ఉంటూ పనులు చేయిస్తూ నాటి స్వప్నాన్ని సజీవరూపంలో చూపించడం అన్నది కేవలం పీలేరు మండల కార్పెంటర్స్ సోదరులకు మాత్రమే సాధ్యం.
ఈరోజు ఎంపీ శ్రీ మిథున్ రెడ్డి గారు , శాసన సభ్యులు శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గార్ల చేతుల మీదుగా పీలేరు కార్పెంటర్స్ కాలనీ ప్రారంభోత్సం కార్యక్రమం జరిగినది. ఎంపీ గారి చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కార్పెంటర్స్ ,వారి కుటుంబ సభ్యులు హాజరుఅయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పీలేరు కార్పెంటర్స్ ఐక్యతకు