ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ , ఎక్కడ జరగని విధంగా కార్పెంటర్స్ జీవితాలలో వెలుగులు నింపి , అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడానికి చిత్తూర్ కార్పెంటర్స్ కమిటీ ఆధ్వర్యంలో ,శ్రీ బుల్లెట్ సురేష్ గారి సహకారంతో , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి చొరవతో 90 మందికి ఒకే స్థలంలో కార్పెంటర్స్ ఎస్టేట్ కి స్థలం కేటాయించడం అన్నది అద్భుతం. ఆ అద్భుతాన్ని సాధించడంలో ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ చంద్ర శేఖర్ గారు , రాష్ట్ర ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ ఆచారి గారు , చిత్తూర్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ కుమరేష్ గారు పడిన కష్టం మాటలకు అందనిది. కొండలు , బండలు పిండిచేసి చదును కార్యక్రమం ఓ యజ్ఞం ల చేసిన చిత్తూర్ కార్పెంటర్స్ కష్టం నేను ప్రత్యక్షంగా చూడటం జరిగినది.
ఈరోజు 04/03/2024 సోమవారం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు స్వహస్తాలతో , బులెట్ సురేష్ గారు , చిత్తూర్ జిల్లా కలెక్టర్ గారు సంయుక్తంగా చిత్తూర్ కార్పెంటర్స్ ఎస్టేట్ ప్రారంభోత్సవం కార్యక్రమం శ్రీ చంద్ర శేఖర్ గారు , శ్రీ మోహన్ ఆచారి గారు , కుమరేష్ గార్ల అధ్యక్షతన వైభవంగా జరిగింది. చుట్టుపక్కల జిల్లాలు అన్నమయ్య జిల్లా నుంచి ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అంబికాపతి గారి ఆధ్వర్యంలో , తిరుపతి జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో కార్పెంటర్స్ విచ్చేయడం జరిగింది. చిత్తూర్ కార్పెంటర్స్ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున హాజరు అయ్యి ఓ పండుగల కార్యక్రమాం జరిగింది