మార్చ్ 27 తేదీని కార్పెంటర్స్ డే గ ప్రకటించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆరోజు ప్రభుత్వ ఆఫీసులయందు( హాస్పిటల్స్ , mro mdo ,పోలీస్ స్టేషన్ , పాఠశాలలలో ) ఉన్న రిపేర్ పనులను ఉచితంగా చేయడం ఆనవాయితీ . తిరుపతి కార్పెంటర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమాజసేవలో భాగంగా వృద్ధులకు , దివ్యంగులకు ఆహారం అందించడం జరిగినది. ముఖ్యఅతిధిగా స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర బాబు గారు హాజరు అయ్యి తిరుపతి కార్పెంటర్స్ సంక్షేమ సంఘ సభ్యులను అభినందించడం జరిగినది. తీరుపతి సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ వెలుగరం కుప్పచారి , గౌరవ సలహాదారుడు శ్రీ నోటకర్ల మురళి ఆచారి , రాజశేఖర్ ఆచారి , మురళీధర్ , మోహన్ ఆచారి తదితరులు పాల్గొనడం జరిగినది.